24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బందుకు సహకరించాలని ఎమ్మెల్యే పైడికి వినతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కోసం తాము చేస్తున్న నిరవధిక బందుకు సహకరించాలని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు  ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో తాము కళాశాలలు నడపలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ప్రైవేట్ కళాశాలల మనుగడ ప్రశ్నార్ధకమైన ఈ వేళ గత నాలుగు రోజుల నుండి కళాశాలలు నిరవధికంగా బందు చేసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. వాటికి మద్దతు ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో తాము జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, అద్దె భవనాల అద్దె కూడా కట్టలేకపోతున్నామని, అదేవిధంగా విద్యార్థుల అకౌంట్లో స్కాలర్షిప్ డబ్బులు కూడా రాకపోవడంతో వారు పరీక్ష ఫీజు కూడా చెల్లించలేకపోతున్నారని అన్నారు. ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ మాట్లాడుతూ గత్యంతరం లేని పరిస్థితిలోనే కళాశాలలను బందు పెట్టడం జరిగిందని, ఇటు కళాశాలలో మనుగడను కాపాడుకోవడానికి, విద్యార్థుల భవితవ్యం కాపాడడానికి మాత్రమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదు మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ నిరసన అని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ ప్రైవేట్ కళాశాల బందుకు సంపూర్ణ మద్దతు ఇచ్చిందని తాము కూడా ప్రైవేటు కళాశాల వెన్నంటి ఉంటామని, తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, నరాల సుధాకర్, హరిస్మరణ్ రెడ్డి, గురువేందర్ రెడ్డి, సూర్య ప్రకాష్, శ్రీనివాస రాజు, గిరి, నవీన్, విజయ్, సుజన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article