సింగిల్ ఫేస్ మోటర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి

0 8,277

 

. . . ఆర్ డబ్ల్యూ ఎస్ డీఈ  మున్ని నాయక్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

వచ్చే వేసవి కాలంలో నీటి ఎద్దడిని నివారించడానికి అధికారులు 20 రోజుల పాటు ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్టు ఆర్ డబ్ల్యూ ఎస్ డిఈ మున్ని నాయక్ తెలిపారు. రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో సోమవారం నీటి ఎద్దడి నివారణ కై ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్, స్థానిక మండల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి నీటి వనరులు, నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా, అవసరమైనంత మేరకే వినియోగించుకోవాలని, నీటిని సంరక్షించే అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సింగిల్ ఫేస్ మోటర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని తద్వారా నీటి పొదుపుతో పాటు కరెంటు బిల్లులు తగ్గించవచ్చని అన్నారు. మంచినీటి సరఫరాలో అవాంతరాలు ఎదురైతే 1916 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. త్రాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాను పటిష్టం చేయాలని, లీకేజీలను వెంటనే సరిచేయాలని, బోర్లు, పంపుల మరమ్మతులు చేయాలని, నీటి వనరులను గుర్తించాలని అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మచ్కూరి రమేష్, ఎంపీవో అరవింద్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ అజయ్, వార్డ్ మెంబర్ జెల్లా సాయిలు, జి.మోహన్, మహేష్, పంచాయతీ కార్యదర్శి మోహన్, కారోబార్ అశోక్ తదితరులు ఉన్నారు.

 

The use of single phase motors should be completely banned.

Leave A Reply

Your email address will not be published.