29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనది

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనదని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. గురువారం నగరంలో గల మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ వారి అంధుల, మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధించడమే కాకుండా వారిలో మంచి లక్షణాలైన, సేవా తత్పరత, సానుభూతి సహనం ఉన్నవారే మంచి ఉపాధ్యాయుడుగా ఎదుగుతారని ఆయన అన్నారు. నార్మల్ పాఠశాలలో ప్రాథమిక దశలో విద్యార్థులకు బోధించడం చాలా కఠినతరమైనదని అందులోనూ దివ్యాంగులకు విద్యను బోధించడం చాలా క్లిష్టమైన విషయమని అందులకు విద్యాబోధన ద్వారా వారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడం జరుగుతుందని మానసిక వికలాంగులకు బోధించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన చెప్పారు. స్నేహ సొసైటీ దివ్యాంగులకు అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు.

The teaching profession is very special.

జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి మాట్లాడుతూ దేవుడు అందరిని తాను చూసుకోలేక అమ్మను సృష్టించాడని ప్రతి ఇంటిలో అమ్మ దేవతలాగా సేవలందిస్తుందని మహిళా సంక్షేమ ద్వారా అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించి చిన్న వయసులోనే పిల్లలకు శిక్షణను ఇవ్వడమే కాకుండా మంచి అలవాట్లు నేర్పించడం అదేవిధంగా వారిలో క్రమశిక్షణ అలవర్చటం చేస్తున్నామని విద్య అనేది విలువలతో  కూడినదిగా  ఉండాలని ఆమె అన్నారు. స్నేహ సొసైటీ ద్వారా మానసిక దివ్యాంగులు జాతీయస్థాయిలో యోగా ద్వారా పేరు తెచ్చుకున్నారని స్వాతంత్ర దినోత్సవం రోజు మానసిక వికలాంగులు పెరేడ్ గ్రౌండ్లో నృత్యం ద్వారా వారి ప్రతిభను చూపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీలో పనిచేసే ఏ జ్యోతి ప్రిన్సిపాల్, డి. సునీత టీచర్ అంధుల ప్రత్యేక పాఠశాల, పి రాజేశ్వరి ప్రిన్సిపాల్, ఎన్ విమల టీచర్, సౌందర్య డాన్స్ టీచర్, మానసికంగా వికలాంగుల పాఠశాల నుండి సన్మానం చేయడం జరిగింది . అదేవిధంగా అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న ఓంకార్ లక్ష్మి, ఏ స్వాతి, సందీప లను సన్మానించారు.

The teaching profession is very special.

More articles

Latest article