తల్లిని కడతెర్చిన తనయుడు….

0 2,167

. . . తల్లి ఒంటిమీద  నగల కోసం హత్య

. . .  వారం రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి

కోటగిరి, బతుకమ్మ :

తల్లిని తనయుడు హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం లోని జల్లాపల్లి లో జరిగింది.  ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది.. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన నేనావత్ రాములు తన తల్లి మంగ్లీ బాయ్ (55) ని డబ్బులు ఇవ్వాలని కోరగా ఆమె ఇవ్వకపోవడంతో వారం రోజుల క్రితం తల్లిని హత్య చేసాడు. తల్లి మెడలో ఉన్న వెండి ఆభరణాలను తీసుకొని మృతదేహాన్ని చెరువు కట్ట వద్ద పడేసి, ఏమి తెలియనట్లు తన తల్లి అదృశ్యమైందని ప్రచారం చేశారు. తన తల్లి అదృశ్యం అయినట్లు పోలీస్ మంగ్లీ బాయ్ కొడుకు నేనావత్ రాములు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయంలో కోటగిరి పోలీసులు రాములపై అనుమానం కలిగి విచారించగా తన తల్లిని తానే చంపినట్లు అంగీకరించారు. మృతదేహం ఎక్కడ ఉంది చూపాలని పోలీసులు తెలుపగా చెరువు కట్ట వద్ద ఉందని మృతదేహాన్ని పోలీసులకు చూపించారు. కోటగిరి పోలీసులు మంగళవారం సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బోధన్ జిల్లా ఆసుపత్రి  తరలించారు. మంగ్లీ బాయి హత్య వెనుక ఆమె కుమారుడు తో పాటు ఇంకెవరన్నా ప్రమేయం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.