ఇందూర్, బతుకమ్మ :
నగరంలోని ఎల్లమ్మగుట్టలోని బొబ్బిల్లివీధిలోని శ్రీ విశ్వజ్యోతి యువజన గణేష్ మండలి ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుడు బొబ్బిలి మధుసూదన్ ఘనంగా సన్మానించారు. ఆదివారం బొబ్బిలి వీధిలోని శ్రీ విశ్వజ్యోతి యువజన గణేష్ మండలి సభ్యులు ఇందల్వాయి మండల ఉత్తమ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సందర్భంగా యూత్ తరపున శాలువాతో సత్కారించారు. ఈ సన్మాన కార్యక్రమంలో 45 డివిజన్ కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, యూత్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
