27.7 C
Hyderabad

నేను బహుజనుల బాణాన్ని. . .యువకుల యుద్ద నినాదాన్ని

I am the arrow of the Bahujans... the battle cry of the youth

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బహుజన రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ను గద్దె దించాల్సిందే

 

. . . నన్ను ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీతో పోరాడుతా

 

. . . బలవంతుడినని దురహంకారంతో సీఎం వీర్రవీగుతున్నాడు

 

. . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

 

కోడంగల్, బతుకమ్మ :

 

నేను కాంగ్రెస్ వదిలిన బాణాన్ని అని బీఆర్ఎస్ అంటోంది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ల ఆస్తుల లెక్కను నాతో కలిపి చెప్పి నేను బీఆర్ఎస్ వదిలిన బాణాన్నిఅంటున్నాడు. ఇంకొంత మంది తెలిసి తెలియక నేను బీజేపీ బాణాన్ని అంటున్నారు. నేను బహుజనుల బాణాన్ని. యువజనుల యుద్ద నినాదాన్నిఅని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం కోడంగల్ లో కోస్గి పాంచజన్య సంకల్ప సభ లో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ అంబేడ్కర్ వాదాన్ని నేను. పూలే గారి ఆత్మగౌరవాన్ని నినాదాన్ని నేను.సాయిత్రి భాయ్ ఆశయాలతో నీటారుగా నిలబడి మగమహారాజులకు ఛాలెంజ్ విసురుతున్న వీరవనితను నేను అని అన్నారు. పండుగ సాయన్న, తుర్రేబాజ్ ఖాన్, రాణి లక్మమ్మ వారసులైన మా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు వందనాలు. 2009 లో టీడీపీ తో పొత్తులో భాగంగా కోస్గీకి చంద్రబాబు. రేవంత్ రెడ్డిలతో కలిసి వచ్చాను.ఇప్పుడు వాళ్లిద్దరూ కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కచ్చితంగా కోస్లీ, కొడంగల్, తెలంగాణ ప్రజల దీవెనలతో నేను కూడా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తానని విశ్వాసంతో ఉన్నానన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉండగా ఇంకో పార్టీ ఎందుకంటూ మా అక్కాచెల్లెలు ఆలోచన చేస్తున్నారని కానీ ఆయా పార్టీలతో మనం బతుకులు ఏమైనా మారాయా? అప్పుడు ఎంత కూలీ వచ్చిందో ఇప్పుడు అంతే వస్తోంది అని అన్నారు.

I am the arrow of the Bahujans... the battle cry of the youth

. . . తెలంగాణలో ప్రతిబిడ్డను చదివించే బాధ్యత తీసుకుంటా

తెలంగాణలోని ప్రతి బిడ్డను చదివించే బాధ్యత మీరు గెలిపిస్తే నేను తీసుకుంటానని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. తెలంగాణలో విద్య పరిస్థితి దారుణంగా తయారైంది. గురుకుల్లాలో ఫుడ్ పాజయిన్ అవుతోంది.పాలిటెక్నిక్ విద్యను తీసేస్తారంట. విదేశాలకు వెళ్లి కూలీ పనిచేసుకోవాలని ముఖ్యమంత్రి చెబుతాడు.అది కాదు మనం కోరుకున్న తెలంగాణ కచ్చితంగా ఈ పరిస్థితి మారాలన్నారు. ప్రతి ఊరికి ఒక స్కూల్, ప్రతి తరగతి ఒక టీచర్ ఉండాల్సిందేనని జనంబాటలో భాగంగా నాగర్ కర్నూల్ వెళ్తే అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఒక బాలింత తల్లి వచ్చి తన గోడు చెప్పుకుందని, తన కూతురికి పుట్టిన బిడ్డను చూపించాలంటే వెయ్యి రూపాయిలు లంచం అడిగారంట, బాలింతలు కనీసం వాళ్ల బట్టలు ఉతుక్కునే పరిస్థితి కూడా లేదన్నారు. కానీ మేము అధికారంలోకి వస్తే ఎంత పెద్ద జబ్బైనా సరే రూపాయి ఖర్చు లేకుండా ఆ భారమంతా తమ ప్రభుత్వమే భరించేలా చూస్తామన్నారు.ఇవ్వన్నీ నేను చెబుతుంటే కొంతమంది నవ్వుతూ నేను చిన్న పిల్లను, ఆడబిడ్డను ఏం తెలుసు అంటున్నారు. కానీ నేను ఒక తల్లిని, తల్లి బిడ్డల బాగోగుల కోసం ఆలోచిస్తుంది, బిడ్డల బాగోగుల కోసం లక్ష కోట్లు ఖర్చు అయిన సరే. ఉచిత విద్య, వైద్యం ఉంటే చాలు మేము యువతను నమ్ముతాం, వారి ఆలోచనలను ప్రోత్సహిస్తామన్నారు.

. . . పాలమూరు రైతులు జూరాల రెగ్యులేటర్ పగలగొట్టే పరిస్థితి ఎందుకొచ్చిందో సీఎం చెప్పాలి?

మహబూబ్ నగర్ లో కాగ్న,తుంగభద్ర,కృష్ణా నది పారుతున్న సరే ఇక్కడ ప్రజలకు నీళ్లు రావటం లేదని, గతంలో అంటే ఆంధ్రోడి పాలన అని అనుకున్నాం. కానీ 12 ఏళ్లు అయినా సరే ఎందుకు కాలేదని ప్రశ్నించారు. నీళ్లు రాక పాలమూరు రైతులు జూరాల రెగ్యులేటర్ పగలకొట్టి నీళ్లు తీసుకున్నారని, మీరు నీళ్లు ఇచ్చి ఉంటే ఎందుకు రైతులు అలా చేసేవారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు దున్నపోతులు ఇచ్చిన సరే బంగారం పండిస్తా అని గతంలో ముఖ్యమంత్రి గొప్పలు చెప్పిండు కానీ ఇప్పుడు రైతులు యూరియా, నీళ్లు, కరెంట్, రైతు భరోసా, మద్దతు ధర, బోనస్ కోసం కూడా బాధపడే పరిస్థితి తెచ్చారన్నారు. మేము అధికారంలోకి వస్తే జురాల నుంచి నీళ్లు తీసుకోని ఇబ్రహీం పట్నం వరకు పది లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తామని, లేదంటే నా పేరు మార్చుకుంటనని సవాల్ విసిరారు. నీళ్లు, యూరియ,కరెంట్ కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకునే పరిస్థితి ఉందన్నారు.

 

 

I am the arrow of the Bahujans... the battle cry of the youth
. . . రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణం

 

ఈ ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత 2024లో ఒక కుటుంబాన్ని పోలీసులు ఘోరంగా కొట్టారని, ఇప్పటి వరకు వారిపై చర్యలు లేవనిః భార్య, భర్తను,కొడుకును ఘోరంగా కొట్టారని ఇప్పటి వరకు చర్యలు లేవని అన్నారు. కుమ్మెర గ్రామంలో అగ్రకులాల కారణంగా రెండు నెలల చాకలి కులానికి చెందిన పాప చనిపోతే ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు.మక్తల్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తే ఓ టీచర పై,రైతులపై రౌడీ షీట్ ఓపెన్ చేశారని, నర్సింహుల్ అనే రైతును గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పోలీసులు కొట్టి చంపారని ఆరోపించారు. ఇది సామాజిక అన్యాయం కాదా?ఈ కాంగ్రెస్ దురహంకారాన్ని మనం అడగవద్దా? అని  ఈ ముఖ్యమంత్రి బలవంతుడనని వీర్రవీగుతున్నాడు. కానీ చలి చీమల చేతిలో బలవంతమైన సర్పం చనిపోయినట్లు ఆయనకు పరాభవం తప్పదన్నారు. ముదిరాజ్, ముస్లింలు, నేతన్నలు, గీతన్నలు వాళ్ల జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనన్నారు.మాదిగ, మాల సోదరులకు కూడా వారికి సమాజంలో గౌరవం దక్కటం లేదని, లగచర్లలో ఈ ముఖ్యమంత్రి లంబాడీ ఆడబిడ్డలపై సాగించిన దాష్టీకం అన్యాయం కాదా అని ప్రశ్నించారు.

. . . తెలంగాణలో మాతృస్వామ్యాన్ని తెచ్చుకుందాం

ఎవరి మద్దతు లేకుండా ఓ మహిళ రాజకీయంగా ఎదుగుతుందని నిరూపిస్తానని, పెద్ద పెద్ద నాయకులు మహిళలను లక్ష్మిదేవి తో పోల్చుతారు. కానీ అవకాశాలు ఇవ్వరు. ఈ దేశంలో ఒక్క రాష్ట్రంలో మాత్రమే మహిళ ముఖ్యమంత్రిగా ఉందా? తెలంగాణలో మనం మాతృస్వామ్యాన్ని తెచ్చుకుందామని,మీరంతా గట్టిగా నాతో ఉంటే చాలు కచ్చితంగా అది సాధ్యమవుతుందన్నారు. ఇక్కడి గట్టు,కేటుదొడ్డు మండలాల్లో అక్షరాస్యత రేటు అఫ్గానిస్తాన్ తో సమానంగా ఉందన్నారు. విద్యా శాఖ మంత్రిగాను ఉన్న ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలన్నారు.ఈ ముఖ్యమంత్రి కి ఇంకా రెండేళ్లే సమయం ఉంది. ఇప్పటికైనా ఇక్కడ పరిస్థితిని మార్చటం పై దృష్టి పెట్టాలన్నారు.  బహుజన రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ను గద్దె దించాల్సిందేనన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని, ఉద్యమం చైతన్యం ఉన్న మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కు 13 సీట్లు ఇస్తే ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, ఇందిరమ్మ ఇళ్ల దందా చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు, ఉద్యోగులకు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిందని, ఇంకా ఎందుకు ఈ కాంగ్రెస్ తో మనం ఉండాలని కచ్చితంగా బహుజన రాజ్యం తెచ్చుకుందామన్నారు.మా పార్టీల బహుజనులకు, యువతకు అవకాశం కల్పిస్తున్నామని మమ్మల్ని ఆశీర్వదించాలని కవిత కోరారు.

I am the arrow of the Bahujans... the battle cry of the youth

More articles

Latest article