27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎల్లారెడ్డిలో కదం తొక్కిన కాషాయ దండు

Must read

📰 Generate e-Paper Clip

  • – స్వచ్ఛందంగా బంద్ పాటించి సంఘీభావం తెలిపిన హిందువులు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : హిందూ  దేవతలపై జరుగుతున్న దాడులకు నిరసన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో హిందువులు నిర్వహించి తలపెట్టిన బంద్ బుధవారం విజయవంతమైంది.ఉదయం నుంచి హిందువులందరూ తమ దుకాణాలను బందు చేయగా పోచమ్మ ఆలయం నుంచి హిందువులందరూ కలిసి బస్టాండ్ గాంధీ చౌక్ శివాజీ చౌరస్తా మీదుగా భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ చౌక్ లో మానవహారం నిర్వహించారు. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందూ దేవి దేవతల పై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పోచమ్మ ఆలయం వరకు వెళ్లి సమావేశం నిర్వహించి హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.ప్రభుత్వం దోషులను వెంటనే శిక్షించాలని. మరోసారి హిందువులపై హిందూ దేవి దేవతల పై దాడులు జరగకుండా అరికట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామాల యువకులు, హిందూ సంఘాలు కులమత బేధంలేకుండా పాల్గొన్నారు.

The saffron army that trampled Kadam in Ellareddy

More articles

Latest article