- ప్రభుత్వంతో తాడో పేడొ తేల్చుకునేందుకు ఆగస్టులో ఛలో హైద్రాబాద్
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ

నిజామాబాద్, బతుకమ్మ : శాసన సభ ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి ఆసరా, చేయూత పెన్షన్ లను పెంచుతామని హమీ ఇచ్చి 20 నెలలు గడిచినా సీయం రేవంత్ రెడ్డి పింఛన్ లను పెంచి ఇవ్వడం లేదని, పెంచాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలో వికలాంగుల, చేయూత పింఛన్ దారుల మహా గర్జన సన్నాహక సదస్సు శుక్రవారం లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతు… 20 నెలలో తమకు హక్కుగా రావాల్సిన పింఛన్ లను పింఛన్ దారులు 20 వేల కోట్లను నష్టపోయారు అన్నారు. వికలాంగులకుకు రూ.6 వేలు, చేయూత పింఛన్ లు రూ.4 వేలు ఇవ్వకుండా ప్రభుత్వం మోసానికి పాల్పడిందన్నారు. రైతులకు ప్రభుత్వం చేసిన రుణమాఫీ పింఛన్ దారుల సొమ్మేనని ఆరోపించారు. భూములు కలిగిన భూస్వాములకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 వేల కోట్ల రుణఃమాఫీ చేస్తే, వారికి 30 వేల కోట్ల రుణ మాఫీ చేయలేదని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని అన్నారు. కాని పింఛన్ దారుల కష్టాలను అధికార ప్రతిపక్షాలు విస్మరించాయని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీలు భూస్వాముల పార్టీలని వారికి ఎన్నికలప్పుడు మాత్రమే పింఛన్ దారులు గుర్తుకు వస్తారని అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు తమకు అవకాశం ఇవ్వండని చేయూత, ఆసరా పింఛన్ దారులకు పెన్షన్ లను పెంచుతామని హమీ ఇచ్చిన రేవంత్ సర్కార్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఆగస్టు 13న చలో హైద్రాబాద్ కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి పింఛన్ లను పెంచి పంపిణీ చేస్తాడో లేక సీయం పదవికి రాజీనామా చేస్తాడో తెల్చుకునే సమయం అసన్నమైందని పిలుపు నిచ్చారు. వికలాంగుల, చేయూత పింఛన్ దారులు పెద్ధ ఎత్తున హైద్రాబాద్ కు తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశం జాతీయ అధ్యక్షురాలు సుజాత సుర్యవంశీ అధ్వర్యంలో జరిగింది.
- పద్మ శ్రీ మందకృష్ణ మాదిగకు సన్మానం..
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు తీసుకున్న తరువాత మొదటి సారి జిల్లాకు వచ్చిన ఆయనను తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు ఘనంగా సన్మానించారు.

