- నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
- నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : శాంతి భద్రతల పరిరక్షణ ,సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వుల ప్రకారం ఏసీపీ నిజామాబాదు రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణ లో ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, 70 పోలీస్ సిబ్బందితో కలిసి ఇస్లాంపూరఖోజా కాలనీ ప్రాంతం లో శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు. ఈ తనిఖీలలో 60 బైక్ లు,7 ఆటొలను సిజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణప్రజలకు భద్రత భావం సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మీ కాలనీలలో ప్రజలందరి భాగస్వామ్యంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సీసీ కెమెరాలు ఉన్నచోట ఎలాంటి నేరం చేయడానికి అయినా భయపడతారని, సీసీ కెమెరాలు 24 గంటలు నిరంతరం రక్షణగా ఉంటాయని తెలిపారు. నేరా నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని కావున ప్రజలందరూ సహకరించి సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. ప్రతిదీ సీసీ కెమెరా లో నిక్షిప్తమై ఉండడం వలన ఏదైనా నేరం జరిగినప్పుడు నిజా నిజాలను గుర్తించడానికి మరియు నిందితులను గుర్తించడం సులభం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు.

