29 C
Hyderabad
Monday, August 3, 2026

కేసీఆర్ దోచుకున్న దాంట్లో వాటా ఇవ్వలేదన్న దే అసలు బాధ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆత్మాభిమానం పేరుతో కవిత కన్నీళ్లు డ్రామా

. . . రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి

 ధర్పల్లి, బతుకమ్మ :

కేసీఆర్ దోచుకున్న సొమ్ము లో తనకు వాటా ఇవ్వలేదన్న దే అసలు కారణమని, ఆత్మాభిమానం పేరుతో మండలిలో ఎమ్మెల్సీ కవిత కన్నీళ్లు పెట్టుకోవడం పూర్తిగా డ్రామా అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి విమర్శించారు. దర్పల్లి  ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అధికారులు ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన డా. భూపతి రెడ్డి మాట్లాడుతూ… గత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ద్రోహులకు ఆసరా ఇచ్చింది కవితే కదా అని ప్రశ్నించారు. ఎందరో ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆమెకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. తెలంగాణపై రూ.9 లక్షల కోట్ల అప్పుల భారం మోపి, ఫామ్ హౌస్‌ల్లో హాయిగా ఉంటూ, దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన రాహుల్ గాంధీ కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికే సొంత ఇల్లు లేని కుటుంబాన్ని పట్టుకుని అహంకారంగా మాట్లాడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

The real pain is that KCR did not give a share of what he looted

కేటీఆర్ మరోసారి ఇలాంటి ప్రవర్తన కొనసాగిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలిపారు.ఈ అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్ నేతలకు ఓర్వలేక కళ్లు మండుతున్నాయని, బీజేపీ దేశాన్ని అమ్ముకుంటూ కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరమని అన్నారు. తెలంగాణను రైజింగ్ తెలంగాణ, గ్లోబల్ సిటీ తీర్చిదిద్దుతామని చెప్పారు. రానున్న రోజుల్లో స్థలాలు లేని పేదలకు 75 గజాల స్థలంలో ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాలకు చెందిన 200 కుటుంబాలకు రూ.2 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు కార్యక్రమం అనంతరం రామడుగు ప్రాజెక్టు ఆయకట్టు కింద వరి పొలాలు సాగునీటిని విడుదల చేశారు.

The real pain is that KCR did not give a share of what he looted

More articles

Latest article