. . . నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులను ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం అనేది నిలుపుదల చేస్తున్నారని నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. శనివారం ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన సందర్బంగా ఆయన డిపో 1 కి వెళ్లి ఆర్టీసీ జేఏసీ నాయకులతో, కార్మికులతో మాట్లాడారు.

బుధవారం అర్థ రాత్రి ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె సందర్భంగా కార్మికుల వద్దకు వచ్చి వారి డిమాండ్ లను విని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, పలు చర్చల తర్వాత డిమాండ్ లకు ఆమోదం తెలపడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్ లని తీసేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యూనియన్ లను ప్రవేశపెడుతున్నదని అలాగే అతి త్వరలో యూనియన్ ఎలక్షన్స్ కూడా ఆర్టీసీ లో నిర్వహించబడతాయని అన్నారు. 2021 పి ఆర్ సి 11% వేతనాలు పెంచడానికి అంగీకారం కుదిరిందని, ఆర్టీసీ లో ఈ పెంచిన పనిభారాలు తగ్గించబడతాయని చట్టప్రకారం ఆర్టీసీ వారికి కూడా అందరిలాగా 8 గంటల పని సమయం వర్తిస్తుందని, 12 గంటలు పని ఉంటే స్పెషల్ ఆఫ్ లు ఇవ్వబడతాయని తెలిపారు. ఇవే గాక ఇంకా ఆర్టీసీ డిమాండ్ లలో, 30 వరకు ఆమోదం తెలుపుతూ ప్రజాప్రభుత్వంలో ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
