- మాజీ ఎమ్మెల్సీ అలుగుబిల్లి నర్సిరెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : న్యాయమైన ఉద్యోగుల, రిటైర్డ్ ఉద్యోగుల కోరికలను చటంలో పరిష్కరించటంలో ప్రభుత్వం చొరవ చూపించాలని, ఆ వర్గం సంతోషంగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అమలుకు అవకాశాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ అలుగుబిల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక డి ఎ ఇప్పుడు ప్రకటించి మరొక డి ఏ ను పది నెలల తర్వాత చెల్లిస్తామని చెప్పటం సరైంది కాదని, అదేవిధంగా ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సంబంధించి ఉద్యోగుల కంట్రిబ్యూషన్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ముందుగా బదిలీ చేయాలని అప్పుడు మాత్రమే ఈ పథకం పక్కాగా అమలు అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పి ఆర్ సి గురించి మాట మాత్రం కూడా చర్చించకపోవడం సరైనది కాదని ఆయన అన్నారు. రిటైర్డ్ ఉద్యోగు లు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనాలని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడులను ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్ట పరచాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో భాగంగా ఆయన నిజామాబాద్కు వచ్చారు.ఈ పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు రామ్మో కే రామ్మోహన్రావు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవిల్ నారాయణ, జిల్లా నాయకులు హామీదుద్దీన్, సాంబశివరావు, సిర్ప లింగయ్య, రాధా కిషన్, బాబా గౌడ్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
