29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

విమానం గాల్లో ఉండగానే  చెలరేగిన మంటలు

Must read

📰 Generate e-Paper Clip

అమెరికాలో ఘటన

సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలెట్లు

వెబ్ న్యూస్, బతుకమ్మ : విమానం గాల్లో ఉండగానే ఎడమ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. లాస్ ఏంజెల్స్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్‌కు బోయింగ్ 767-400 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో విమానంలో ఎంత మంది ఉన్నారనే  విషయాన్ని అధికారులు వెల్లడించ లేదు.  పైలెట్లు అప్రమత్తమై విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రన్ వే పైకి వచ్చి మంటలను అదుపు చేశారు.

More articles

Latest article