25.4 C
Hyderabad

7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ అండ్ ఎస్ డిజి సినర్జీస్‌కు హాజరైన జునైద్ ఆలీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఐఎ డబ్ల్యూ పిఏ బ్రాండ్ అంబాసిండార్ గా హజరు

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త మహమ్మద్ జునైద్ అలీ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఉన్న యుఎన్ సిసి ఐక్యరాజ్యసమితి సమావేశ కేంద్రంలో ఐక్యరాజ్యసమితి ఆసియా పసిఫిక్ ఆర్థిక, సామాజిక కమిషన్ (ఈఎస్ సిఎపి) నిర్వహించిన 7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ అండ్ ఎస్ డిజి సినర్జీస్‌కు హాజరయ్యారు. ఈ ఉన్నత స్థాయి సమావేశం జూన్ 29, 30న జరిగింది.  దీనికి వివిధ దేశాల నుండి అనేక మంది మంత్రులు హాజరయ్యారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన జునైద్ అలీ, తాను అంతర్జాతీయ సభ్యునిగా పనిచేస్తున్న తన అంతర్జాతీయ సంస్థ ఐఎ డబ్ల్యూ పిఏ తరపున ఈ సమావేశంలో ప్రాతినిధ్యం వహించారు.

 

Junaid Ali attended the 7th Global Conference on Climate and SDG Synergies.

 

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ పీస్ అడ్వకేట్స్ (ఐఎ డబ్ల్యూ పిఏ) జునైద్ అలీ మహమ్మద్ ద్వారా సంస్థకు లభించిన అద్భుతమైన ప్రాతినిధ్యం ఇచ్చిందన్నారు. సంస్థ ప్రతినిధిగా, అంబాసిడర్ జునైద్ అలీ మహమ్మద్ సమ్మిళిత, తక్కువ – కార్బన్ అభివృద్ధి కోసం సుస్థిర రవాణా, చలనశీలత, అనే ఇతివృత్తంతో జరిగిన థీమాటిక్ రౌండ్‌టేబుల్  సమావేశంలో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (మద్దతుగా, వాతావరణ మార్పులను తట్టుకోగల, సమ్మిళిత, తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువరించే రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి అవసరమైన వినూత్న పరిష్కారాలపై చర్చించడానికి ఈ ఉన్నత స్థాయి సమావేశం ప్రపంచ నాయకులను, విధాన రూపకర్తలను, అభివృద్ధి భాగస్వాములను, సుస్థిరత నిపుణులను ఒకచోట చేర్చిందని గుర్తు చేశారు. ఈ సదస్సులో ఆయన ఉనికి, సంభాషణ, భాగస్వామ్యం, సామూహిక చర్యల ద్వారా శాంతియుత, సుస్థిర, సంపన్న ప్రపంచాన్ని నిర్మించాలనే మన ఉమ్మడి దార్శనికతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. మనం కలిసి శాంతి, సుస్థిరత, ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కృషి చేద్దాం అని జునైద్ ఆలీ అన్నారు.

 

Junaid Ali attended the 7th Global Conference on Climate and SDG Synergies.

More articles

Latest article