25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బోనమెత్తిన భాగ్యనగరం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్​,బతుకమ్మ : హైదరాబాద్ నగరంలో బోనాల జాతర ప్రారంభమైంది. అమ్మవారి ఆలయాలకు ఆదివారం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్వాన్‌లోని దర్బార్‌ మైసమ్మను జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు.  లాల్ దర్వాజా మహంకాళి ఆలయం వద్ద కవిత బోనమెత్తారు. లాల్ దర్వాజా మహంకాళి  అమ్మవారిని దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, బీజేపీ నాయకురాలు మాధవీలత దర్శించుకున్నారు.

Bonamettain Bhagyanagaram

Bonamettain Bhagyanagaram

Bonamettain Bhagyanagaram

Bonamettain Bhagyanagaram

Bonamettain Bhagyanagaram

More articles

Latest article