. . . సైనికుల వెంట నిలబడడం గర్వంగా ఉంది
. . .అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ :
పహల్గామ్ దాడితో భారతీయుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదుల ఖర్ఖానా అయిన పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ పేరిట జరిపిన దాడికి యావత్ భారతదేశం వారి వెంట ఉందని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయం” త్రివిధ దళాల సేవలకు కృతజ్ఞతగా సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో మేము సైతం దేశం కోసం అనే నినాదంతో సోమవారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని శివాజి చౌక్ ఆర్.ఆర్. చౌరస్తా వద్ద తిరంగా యాత్ర జరిగింది.

ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సైనికులకు ఇందూరు ప్రజలు మేము సైతం వెంట ఉంటామని ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల ప్రాణాలను తీసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు మన సైనికులు తగిన గుణపాఠం చెప్పారన్నారు. భరతమాత వేషధారణలో.. సైనికుల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదేవిధంగా భారీ భరతమాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ ప్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, నాయకులు కృపాకర్ రెడ్డి, రాజ్ కుమార్ సుబేదార్, మాజీ కార్పొరేటర్లు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

