26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఏర్గట్ల మండలం లో కొలువు దీరిన పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Must read

📰 Generate e-Paper Clip

ఎర్గట్ల, బతుకమ్మ :

ఎర్గట్ల మండలం పరిధిలో గల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకరణ మహోత్సవం గ్రామ ప్రజల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఏర్గట్ల గ్రామ సర్పంచ్ గా కొలిపాక ఉపేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ గా సున్నపు లక్ష్మి, వార్డు మెంబర్లు, తాళ్ల రాంపూర్ సర్పంచ్ గా బెజ్జారపు పావని భానుచందర్, ఉప సర్పంచ్ గా చాట్ల జనార్ధన్,వార్డు సభ్యులు, తడపాకల్ సర్పంచ్ గా జింక స్వప్న అనిల్ యాదవ్, ఉప సర్పంచ్ గా లోనపు రాజు, గ్రామ వార్డు సభ్యులు,బట్ట పూర్ సర్పంచ్ గా భూషణ వేణి ప్రవీణ్ యాదవ్,ఉప సర్పంచ్ గా మూడ్ దయానంద్ నాయక్,అలాగే గ్రామ వార్డు సభ్యులు తోర్థి గ్రామ సర్పంచ్ గా కౌడ పెద్ద భూమేశ్వర్, ఉప సర్పంచ్ గా గొల్లపల్లి సుమన్ గౌడ్, అలాగే వార్డు సభ్యులు నాగేంద్ర నగర్ గ్రామ సర్పంచ్ గా సందే రంజిత్,ఉప సర్పంచ్ గా షేక్ జాకీర్,గుమ్మిర్యాల సర్పంచ్ గా దేశ బోయిన జమున సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ గా జై డి కిషోర్ రెడ్డి,  గ్రామ వార్డు సభ్యులు, దోంచంద గ్రామ సర్పంచ్ గా పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి,ఉప సర్పంచ్ గా ఆశిరెడ్డి హనుమంత్ రెడ్డి, అలాగే వార్డు సభ్యులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇట్టి సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి విషయం అలాగే మురికి కాలువలపై ప్రత్యేక దృష్టి కేటాయించి వాటి పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ నూతనంగా ఎన్నికైన పాలకవర్గం గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

The Panchayat Governing Body based in Ergatla Mandal took oath

More articles

Latest article