27.5 C
Hyderabad

కులాంతర వివాహం .. వివక్ష … వరకట్న వేధింపులు

Inter-caste marriage ... discrimination ... dowry-related harassment

Must read

📰 Generate e-Paper Clip

 

… అత్త మామాలు, భర్త , వదినలకు జైలుశిక్షలు

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

దళిత మహిళను ప్రేమించి వివాహం చేసుకుని ఆ తరువాత కులం పేరుతో అవమానించి, దూశించి, నగదు వరకట్నం కోసం వేధింపులకు గురి చేసిన భర్త గడ్డం రంజిత్ గౌడ్ అతని తల్లి గడ్డం సుశీల, తండ్రి గడ్డం ముత్త గౌడ్, వదిన గడ్డం మమత లకు వేర్వేరు నేరాలలో మూడు, ఒకటి, మూడు సంవత్సరాల చొప్పున సాధారణ జైలుశిక్షలు విదిస్తూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పై జరిగిన అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి సుగాలి నారాయణ గురువారం తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపిన వివరాలు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామానికి చెందిన గడ్డం రంజిత్ గౌడ్, మాల సామాజీక వర్గానికి చెందిన పట్టేపు ప్రియాంక లు ప్రేమించుకుని నిజామాబాద్ నగరంలోని ఆర్య సమాజంలో 2016 సంవత్సరం జూన్ 13 వ తేదీన కులాంరత వివాహం చేసుకున్నారు.వీరి పెళ్లి రంజిత్ తల్లితండ్రులు సుశీల, ముత్తగౌడ్ లతో పాటు అతని వదిన మమత లకు నచ్చలేదు. కులం తక్కువ దాన్ని పెళ్లి చేసుకున్నాడని ఇంటిలోకి రానీయలేదు. దాంతో రంజిత్, ప్రియాంక ఆర్మూర్ లోని వెంకటేశ్వర కాలోనిలో కిరాయి ఇంటిలో అద్దెకు ఉన్నారు. దాంపత్య జీవితంలో వీరికి ఇద్దరు కుమారులు జన్మించడంతో శ్రేయాన్సు గౌడ్, ఆర్యన్స్ గౌడ్ గా పేర్లు పెట్టుకున్నారు. పిల్లలు పుట్టిన కొన్ని సంవత్సరాలకు మల్లి ఇస్సాపల్లికి వచ్చారు. రంజిత్ తల్లితండ్రులు, వదిన ససేమిరా ఇంటిలో ఉండటానికి ఒప్పుకోలేదు. తిరిగి ఆర్మూర్ పట్టణంలో కిరాయికి ఉన్నారు. కొన్నేళ్లకు రంజిత్ గౌడ్ తన భార్యను నీ వలన తల్లితండ్రులకు దూరంగా ఉంటున్న కులం తక్కువ దానివి అంటు అవమానించే వాడు. నగదు కట్నం నీ తల్లితండ్రుల నుండి తీసుకురాపో అంటు వేధింపులకు గురిచేసేవాడు. భర్త  శరీరక, మానసిక హింసను తట్టుకోలేని ఆమె తన తల్లితండ్రులను ఓప్పించి ఎనిమిది లక్షలు తీసుకుని వచ్చి భర్తకు ఇచ్చింది అయిన అతని కులం తక్కువ ఎత్తిపొడుపులు అవమానాలు, వరకట్నం వేధింపులు భరించలేక ఆర్మూర్ పోలీసులకు పిర్యాదు చేసింది. పిర్యాదుననుసరించి నేర విచారణ చేసిన పోలీసులు ఛార్జషీట్ కోర్టులో దాఖలు చేశారు. సాక్షుల సాక్ష్యాలు నమోదు చేసిన స్పెషల్ ఎస్ ఎస్టీ కోర్టు ముద్దాయిలపై నేర అభియోగాలు రుజువు అయినట్లు ప్రకటించింది.కుల వివక్ష పాటించినందుకుగాను మూడు సంవత్సరాల సాధారణ జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమాన, వరకట్నం వేధింపులకుగాను మూడు జైలుశిక్షతో పాటు వేయి రూపాయల  జరిమానా,వరకట్నం డిమాండ్ చేసినందుకుగాను ఒక సంవత్సరం జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విదిస్తూ స్పెషల్ జడ్జి సుగాలి నారాయణ తీర్పు వెలువరించారు.

More articles

Latest article