27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

దొంగతనం చేపలు పడుతున్నాడని కొట్టి చంపారు

Must read

📰 Generate e-Paper Clip

. . . ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు

 

కామారెడ్డి, బతుకమ్మ :  

 

తన భర్త దొంగతనంగా చెరువులో చేపలు పడుతున్నారని కొందరు పథకం ప్రకారం కొట్టి చంపారని వారిపై కేసులు నమోదు చేయాలని బాధితురాలు కామారెడ్డి జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా  ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఎల్లారాంతాండకు చెందిన జాదవ్ సంతోష్ ఈ నెల 14న పుల్కల్ చెరువులో శవమై తేలాడు. తన భర్త జాదవ్ సంతోష్ ను గ్రామానికి చెందిన అక్కమ బాలబోయి, పెద్దోళ్ళ చిన్నసాయిలు, చిన్నోల సాయిబోయి, నర్సబోయిలు, తదితరులపై దొంగతనంగా రాత్రివేళ తమ చెరువులో చేపలు పడుతున్నాడని చంపేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే తన భర్త ఈతరాకుండా నీటమునిగి చనిపోయాడని ఎఫ్ఐఆర్ చేశారని వాపోయింది. తన భర్త మరణానికి కారకులైన వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీని కోరారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన అనంతరం కేసును విచారించి చర్యలు తీసుకుంటామని కోరారు.

More articles

Latest article