27.5 C
Hyderabad
Friday, July 31, 2026

అభివృద్ధికి అడ్డుగోడ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

  •  కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు 

బతుకమ్మ, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అడ్డు గోడలా నిలుస్తున్నాడని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు ఆరోపించారు.  కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని  అర్హతలున్న కామారెడ్డి నియోజకవర్గానికి రావలసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఈరోజు జుక్కల్ కి తరలి వెళ్ళిపోయింది.  రాష్ట్రంలో 13 నర్సింగ్ కాలేజీలు రాగా కామారెడ్డికి నీ వైఖరి వల్ల రాలేదు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ  ఎంతో కష్టపడి కామారెడ్డి అభివృద్ధికి నిధులు తీసుకువస్తే దానిపై కూడా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేసి తెచ్చిన అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్, ఆర్మూర్ లో గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలతో కలిసి అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నారనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించానే నీ మోనార్కిజం,  నీ సైకో శాడిస్ట్ చేష్టల వల్ల, విసిగి వేసారిన కామారెడ్డి నియోజకవర్గం ప్రభుత్వ అధికారులు  ట్రాన్స్ఫర్ చేయించు కుంటున్నారు. సెలవులపై వెళ్ళిపోతున్నారు.  దీంతో కొత్తగా ఎవరైన అధికారులు రావడానికి కూడా జంకుతున్నారు. టీవీ ఇంటర్వ్యూలలో మైకులు పట్టుకుని అవినీతి రహిత పాలన అందించడమే నా లక్ష్యం అని ఉపన్యాసం దంచే నీవు డిగ్రీ కాలేజీ భూములలో అవినీతిచేసి  అన్యక్రాంతం  చేశావు.  అరోరా కాలేజీ వారికి అప్పనంగా 26 ఎకరాలు అందించావు.  దానిపై వారు 17 కోట్ల అప్పు చేశారు.  వాళ్లు దోచింది ఎంత నీకు ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు. నీకు దమ్ముంటే కాలేజీ భూముల అవినీతిపై  బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ చేశారు. నిన్ను గెలిపించిన కామారెడ్డి ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు.  రేవంత్ రెడ్డి ని గెలిపించుకుంటే రాష్ట్రంలోనే కామారెడ్డి అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంటుండే అని వాపోతున్నారు న్నారు. నీ సొంత నిధులు 150 కోట్లతో అభివృద్ధి చేస్తానని అబద్ధపు ప్రచారాలు చేసి గెలిచి కామారెడ్డి ప్రజలను నట్టేట ముంచినవన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న  సీఎం ఆర్ చెక్కులను షబ్బీర్ అలీ ఎంతో కష్టపడి 300 చెక్కులు మంజూరు చేయిస్తే, ప్రోటోకాల్ ప్రకారం చెక్కులు నేనే పంచుతా అని సీఎం ఆఫీసులో ధర్నాకు కూర్చున్నావు. మా నాయకుడు పెద్దమనసు చేసుకొని చెక్కులు ఎవరు పంచితే ఏమి? నియోజకవర్గ ప్రజలకు మేలు జరగాలని కోరారు. కామారెడ్డి ప్రజలు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో బిజెపికి ఆధిక్యం ఇచ్చారు. విద్యాసంస్థలు, సాగునీరు, తాగునీరు, ఇండస్ట్రీలు, ప్రాజెక్టులు కామారెడ్డికి రావాలంటే ముఖ్యమంత్రి కి అత్యంత సన్నిహితులు మన ప్రియతమ నాయకుడు షబ్బీర్ అలీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కామారెడ్డి మేధావులారా విద్యార్థులారా నాయకులారా ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. ఈరోజు ప్రోటోకాల్ కావాలా అభివృద్ధి కావాలా స్థానిక ఎన్నికల్లో మా సత్తా ఏంటో చాటుతాం మీ సొంత నిధులతో చేస్తానన్న అభివృద్ధిని ప్రజలే నిన్ను నిలదీసి గ్రామంలో రాకుండా అడ్డుకునే  రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ చంద్ర కాంత్ రెడ్డి, పండ్లరాజు, భీమ్ రెడ్డి, కారంగుల అశోక్ రెడ్డి, గాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, గోనె శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, యాదవ రెడ్డి, నాసిలాల్ నాయక్, గుడుగులశ్రీనివాస్, సుతారి రమేష్ , పల్లె రమేష్ గౌడ్, అనంతరెడ్డి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ సలీం, అంజద్, పాత శివ కృష్ణమూర్తి, జూలూరి సుధాకర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article