27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఏర్గట్ల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఆర్మూర్ ఏసీపీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ను ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ జె వెంకటేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కేసుల పూర్వాపరాలను ఎస్సై రాము ను అడిగి తెలుసుకున్నారు. నేరాల పట్ల సైబర్ మోసాల పట్ల దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసు సిబ్బందిచే పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మెదలాలని ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో భీమ్ గల్ సీఐ, స్థానిక ఎస్సై రాము, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article