అభివృద్ధికి అడ్డుగోడ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు బతుకమ్మ, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అడ్డు గోడలా నిలుస్తున్నాడని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు ఆరోపించారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని అర్హతలున్న కామారెడ్డి నియోజకవర్గానికి రావలసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఈరోజు జుక్కల్ కి తరలి వెళ్ళిపోయింది. రాష్ట్రంలో 13 నర్సింగ్ కాలేజీలు రాగా కామారెడ్డికి నీ వైఖరి వల్ల రాలేదు. ప్రభుత్వ సలహాదారు...