24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వడ్లు కొనుగోలుపై కాంగ్రెస్ నాయకుల విమర్శ సరికాదు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: తాళ్ల రాంపూర్, వడ్ల కొనుగోలు కేంద్రంలో  గతంలో ఐదు నుంచి 6 కిలోలు కడతా తీసుకునేవారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం అని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్నా వాళ్ళ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ ఏర్గట్ల మండల అధ్యక్షుడు పూర్ణానందం విమర్శించారు. ఒకపక్క రైతులు పండించిన వరి పంటను రోడ్ల పైన ఆరబెట్టి అమ్ముడుపోక పడికాపులు కాస్తున్న పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు కడ్త విషయం లో గత ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు.ఇప్పటికీ ఉన్న పంటకు ప్రభుత్వం ఇస్తామన్నా 500/ రూపాయల బోనస్ ఇవ్వకపోగా పైగా విమర్శలు చేయడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం సన్నం వడ్లతో పాటుగా దొడ్డు వడ్లను కూడా కొని హామీ ప్రకారంగా 500 రూపాయల బోనస్ వెంటనే రైతులకు చెల్లించాలి అని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. రైతులను నిలువెత్తిన ముంచిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని రైతులకు ఇప్పటికే అర్థమయిపోయింది. ఎన్నికల ప్రచారంలో ఇదే అన్వేష్ రెడ్డి మాట్లాడిన మాటలకు కట్టుబడి ప్రస్తుతం రైతులు అనుభవిస్తున్న కష్టాలకు  పూర్తి బాధ్యతలు తీసుకోని పండిన దొడ్డు,సన్నా,వడ్లను రైతు పండించిన ప్రతి గింజను కొనాలి అంతేకాకుండా వారికి మద్దతు ధర తో పాటుగా 500/ రూపాయలు  బోనస్ ఇప్పించాలి  లేదంటే రైతులు తగిన గుణపాఠం చెబుతారు అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు అసత్య మాటలు బంధ్ చేసి క్షేత్ర స్థాయిలో రైతులను పట్టించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ క్ర్యకములో బిఅరెస్ పార్టీ మండల అధ్యక్షులు పూర్ణ నందం, గ్రామ శాఖ అద్యక్షులు బొనగిరి రమేష్, బియర్ఎస్ పార్టీ నాయకులూ అశోక్ యాదవ్, నేరెళ్ళ దేవన్న, గంగాధర్, అడెల్లి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article