పత్రికల్లో వచ్చిన వార్త అవాస్తవం : ఎస్ఈ

0 14,551

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పత్రికల్లో వచ్చిన 33కేవీ ఆర్టీసీ ప్రత్యేక లైన్ పనుల గురించి వచ్చిన వార్త నిరాధారమైనది, అవాస్తవమని నిజామాబాద్ ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపారు. 33కేవీ ప్రత్యేక ఫీడర్              132/33కేవీ నిజామాబాద్ విద్యుత్ ఉపకేంద్రం నుంచి ఆర్టీసీ డిపో -2 వరకు  ఆర్టీసీ బస్సుల ఈవీఎం ఛార్జింగ్ కోసం ఆర్టీసీ సంస్థ 33కేవీ హెచ్టీ సర్వీస్ 5000 కెవిఏ, సీఎండీ కొరకు  దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.  ఎస్ఈ ఆఫీస్ నుంచి సంయుక్తంగా సర్వే చేసి ఎస్టిమేట్ మంజూరి వందశాతం ఎస్ఎల్సీలో కార్పొరేట్ ఆఫీస్ వరంగల్ నుంచి మంజూరు చేశారని తెలిపారు.  ఆర్టీసీ వారు వందశాతం మంజూరి మొత్తం విలువ ఎన్పీడీసీఎల్ కు చెల్లించిన తరువాత పనులు ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం కూడా పనుల్లో మంజూరు ప్రకారమే చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి డీవియేషన్  లేకుండా 33కేవీలైన్ మున్సిపల్ అధికారులు రోడ్  మ్యాప్ సూచించిన విధంగా పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. కొందరు కావాలని దీన్ని సొంతలాభానికి ఆపాలని చూస్తున్నారన్నారు. ఒక ప్రభుత్వ సంస్థ ఆర్టీసీ కోసం వేస్తున్నామని, దీంట్లో ఏ అధికారికి వ్యక్తిగత ప్రయోజనం  లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.