28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కుక్క కాటుతో బాలుడి మృతి

Must read

📰 Generate e-Paper Clip

  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 25 రోజులకు మృతి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో కుక్కకాటుకు చిన్నారి బాలుడు మృత్యువాత పడ్డాడు. ఆడుకునేందుకు వెళ్లిన బాలుడిని వీధి కుక్కలు కరవడంతో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని బాబన్ సహాబ్ పహాడ్ ప్రాంతంలో  కబీర్ (7) అనే బాలుడు స్కూల్ కి వెళ్తుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. జూన్ 20  జరిగిన ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా స్థానిక వైద్యులు హైదరాబాద్ కు రిఫర్ చేశారు. ఈనెల 14న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజామాబాద్ నగరంలో వీధి కుక్కలను నియంత్రించేందుకు బల్దియా గత ఏడాది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసింది. ఈ సంవత్సరం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కాలనీలలో గల్లీలలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలపైకి పిల్లలపైకి దాడులు చేస్తున్నాయి. వీధి కుక్కలను బల్ది అధికారులు నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.

Boy dies from dog bite

More articles

Latest article