27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కనువిందు చేస్తున్న” మే” పుష్పం…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని కారంగుల దీవెన సిస్టర్ గృహంలో ‘మే పుష్పం’ వికసించి చూపరులను కట్టిపడేస్తోంది. సాధారణంగా మే నెలలో మాత్రమే పూసే ఈ పుష్పం ప్రత్యేకత ఎర్రటి రంగులో, గుండ్రంగా బంతి ఆకారంలో ఉండే ఈ పువ్వు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వర్షాకాలం ప్రారంభ సూచికగా, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో వికసించే ఈ ‘మే ఫ్లవర్’ ఏడాది పొడవునా మొక్క దశలో ఉండి, కేవలం ఈ సీజన్‌లో మాత్రమే తన అందాలను వెదజల్లుతుంది. అరుదుగా కనిపించే ఈ పువ్వును చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

More articles

Latest article