27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇచ్చిన గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

మాక్లూర్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాక్లుర్ తహసీల్దార్ రాజశేఖర్ కు బిజెపి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ ఆరు గ్యారంటీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ కాలం గడుపుతుందని తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. సాధ్యం కానీ హామీలతో గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రేవంత్ సర్కార్ రాష్ట్రమంతా రాక్షస పాలన సాగిస్తుందన్నారు. తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు మదారి మమత, సర్పంచ్ దర్మపతి, రాజేశ్వర్, సురేష్ నాయక్, రమేష్, రాజు, ప్రతాప్ బిజెపి నాయకులు పాల్గొన్నారు.

 

The guarantees given should be implemented immediately.

More articles

Latest article