ఇచ్చిన గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి
మాక్లూర్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాక్లుర్ తహసీల్దార్ రాజశేఖర్ కు బిజెపి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ ఆరు గ్యారంటీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ కాలం గడుపుతుందని తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. సాధ్యం కానీ హామీలతో గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రేవంత్ సర్కార్ రాష్ట్రమంతా రాక్షస పాలన సాగిస్తుందన్నారు....