26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పశువులకు ఉచిత టీకాల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

మాక్లూర్, బతుకమ్మ :

 

మాక్లుర్ మండలంలోని గుంజిలీ, గొట్టుముక్కల, వేణు కిషన్ తండా గ్రామాల్లో పశువులకు ఎఫ్ఎండీ నివారణ కోసం మాక్లుర్ పశు వైద్యులు డాక్టర్ డా.ఉమామా సాహెర్ ఆధ్వర్యంలో ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువులకు తీవ్రమైన అంటు వ్యాధి అయిన ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ నుండి రక్షించేందుకు ఈ టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు తమ పశువులకు సమయానికి టీకాలు వేయించుకోవాలని, పశువుల ఆరోగ్యాన్ని కాపాడాలని పశు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వినిత (వీఎల్ఓ), కళ్యాణి (జేవీఓ), గంగాధర్, పుష్ప, శ్యామల, సికిందర్, గోపాల్ మిత్ర సుధీర్, స్థానిక రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article