- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరి ధాన్యాన్ని త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామంలో ఐ.కే.పి. ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ఆకాల వర్షాలు కురియడం వలన ధాన్యం తడిసి పోయే పరిస్థితులు ఉన్నాయని, రైతులకు టార్ఫాలిన్ లు అందజేయాలని తెలిపారు. తూకం వేసిన ధాన్యాన్ని త్వరగా లారీల్లో సంబంధిత మిల్లులకు తరలించాలని తెలిపారు.ఈ నెల చివరి నాటికి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రం ఇంచార్జీ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, తహసీల్దార్ గంగా సాగర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, మహిళా సంఘం సభ్యురాల్లు, రైతులు పాల్గొన్నారు.

