29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పిడుగుపాటుకు నలుగురు మృతి

Must read

📰 Generate e-Paper Clip

. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఘటనలు

. మరో నాలుగు రోజులపాటు వర్షాలు, ఉరుములు, మెరుపులు

నిజామాబాద్, బతుకమ్మ: ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. పిడుగుపాటు కారణంగా వివిధ జిల్లాల్లో మొత్తం నలుగురు మృతి చెందారు. నల్గొండ, మహబూబాబాద్, వనపర్తి జిల్లాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. తుపాను కారణంగా రానున్న నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. పిడుగుపాటుకు గురికాకుండా రైతులు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలకు బయటికి వెళ్లొద్దని పేర్కొంది.

More articles

Latest article