. . . ఆర్టీసీ సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
నందిపేట్, బతుకమ్మ :
కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని సమ్మె నిర్వహిస్తున్నట్టు ఆర్టీసీ కార్మికులు తెలిపారు. ఈ నెల 22 నుండి జరగబోయే ఆర్టీసీ సమ్మె పోస్టర్ ను సోమవారం ఆర్టీసీ కార్మికులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ ని గవర్నమెంట్ లో విలీనం చేసేంతవరకు కార్మికుల కష్టానికి తగ్గట్లు వేతనాలు సవరణ చేయాలన్నారు. కార్మికులకు వచ్చే ఇంక్రిమెంట్లను కూడా తొందరగా ఇప్పించాలని, బస్సులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ డ్రైవర్లచే కొనసాగించాలని అన్నారు. అలాగే కొత్తగా డ్రైవర్, కండక్టర్ జాబ్ లను భర్తీ చేసి వారికి పని ఒత్తిడి తగ్గిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న యువత కు ఉపాధి చేకురేలా చూడాలని కోరారు. అలాగే ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్న డ్రైవర్ లను పర్మినెంట్ చేయాలన్నారు. ఈ సమ్మె కు జిల్లా ప్రజలు, అద్దె బస్సు ల డ్రైవర్ లు మద్దతు ఇవ్వాలని కోరారు.

