24.8 C
Hyderabad
Friday, July 31, 2026

సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి

 

నవీపేట్, బతుకమ్మ :

 

సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రజలకు అండగా నిలిచేందుకు తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి పేర్కొన్నారు. బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కల్వకుంట్ల కవిత నూతనంగా ప్రారంభించిన తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఈ జెండా పండుగను నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ ఆచారి, రామ్ కిషన్ రావు పాల్గొని టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన ద్వారా పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి టిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కిషోర్, వరలక్ష్మి, సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు, ఆశిష్, కృష్ణ అవంతి రావు, ప్రవీణ్, లక్ష్మినారాయణ, జనార్ధన్, విజయలక్ష్మి, కరిపె రాజు, శంకర్, శ్రీనివాస్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

The goal is to achieve a socially equitable Telangana.

More articles

Latest article