20.7 C
Hyderabad

మహిళలు  పిల్లల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది

The Telangana government is prioritizing the safety of women and children

Must read

📰 Generate e-Paper Clip

 

. . . దక్షిణాది ప్రాంతీయ సదస్సులో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

మహిళలు, పిల్లల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని,  పోలీసులు, భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు వంటి అనేక వ్యవస్థలు పని చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ  ఆధ్వర్యంలో “డిజిటల్ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం, ఆన్‌లైన్ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం” అన్న ఇతివృత్తంపై దక్షిణాది ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

The Telangana government is prioritizing the safety of women and children
 

ఈ సదస్సులో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ , సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ  ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ జస్టిస్ విక్రమ్ నాథ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్,  జస్టిస్ అలోక్ అరాధే,  తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్-ఇన్-చీఫ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, త్రిపుర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ జస్టిస్ శ్యామ్ కోషి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు హైకోర్టుల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, పలువురు మాజీ న్యాయమూర్తులు పాల్గొన్నారు. .  న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవల కోసం సిద్ధం చేసిన సంచార లోక్ అదాలత్  వాహనాలను  కేంద్ర మంత్రి , న్యాయమూర్తుల సమక్షంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు.

The Telangana government is prioritizing the safety of women and children

ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “భరోసా కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు ఒకేచోట పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నామన్నారు. దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని, పిల్లల రక్షణ కోసం పోలీసు శాఖలోని విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో షీ భరోసా సైబర్ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని, సైబర్ యాప్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులనే సైబర్ అంబాసిడర్లుగా తయారు చేసి, తమ తోటి విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని, అన్ని శాఖలు కలిసి పనిచేస్తేనే పిల్లలకు రక్షణ, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించగలమన్నారు. “ఆర్థిక సహాయం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించడం వరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, టీజీఎస్ ఎల్ఎస్ఏ పాఠశాల విద్యాశాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు వారి చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 3,000 మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చాం” అని తెలిపారు.సైబర్ నేరాల వలలో పిల్లలు పడకుండా ఇలాంటి కార్యక్రమాల్లో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణ విషయంలో ప్రతి పిల్లవాడు, తల్లిదండ్రులు నియంత్రణ కోసం ప్రత్యేకంగా కేటాయించిన నంబర్ – 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం – 1098 నంబర్లు తప్పక గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. “సైబర్ నేరాల బారిన పడకుండా పిల్లలకు తల్లిదండ్రుల మద్దతు అవసరమని, పిల్లలను తప్పుబట్టే విధంగా కాకుండా ఆసక్తితో అవగాహనతో పిల్లకు మద్దతుగా మార్గదర్శకత్వం చేయాలన్నారు. పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు మనమంతా కలిసి పనిచేద్దామని, అందుకు ఈ సదస్సులో జరిగే చర్చలు, సూచనలు, సిఫారసులు యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తాయని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ఏఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో దక్షిణాది ప్రాంతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషకరమని పేర్కొంటూ సదస్సునకు హాజరైన ప్రతినిధులందరికీ ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు అత్యంత ముఖ్యమైన సైబర్ సెక్యూరిటీ అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకుని నివారణ చర్యల కోసం ఈ సదస్సు నిర్వహించడంపై ముఖ్యమంత్రి జస్టిస్ విక్రమ్ నాథ్ కి, ఎన్ఏఎల్ఎస్ఏకు ధన్యవాదాలు తెలిపారు.న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష పడటం కాదని, న్యాయం అంటే బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడమని, గౌరవాన్ని తిరిగి ఇవ్వడమన్నారు. ముఖ్యంగా పిల్లలు కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయమని, న్యాయ సేవల ప్రాధికార సంస్థల కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

The Telangana government is prioritizing the safety of women and children

More articles

Latest article