27.2 C
Hyderabad

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో ఓట్ల గల్లంతు

Voter turnout in Indian Red Cross Society

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎన్నికల అధికారికి ఎలక్షన్ ఒక రోజు ముందు ఫిర్యాదు

నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ రెడ్ క్రాస్ జిల్లా కమిటీ ఎన్నిక కు ఒకరోజు ముందు ఓట్ల గల్లంతు వ్యవహరం వెలుగు చూసింది.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ గతంలో మెంబర్షిప్ తీసుకున్న వారి పేర్లు తొలగించడం జరిగిందని శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్ , రెడ్ క్రాస్ సొసైటీ ఎలక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు కు శనివారం ఇందూరు సేవా సమితి ప్యానల్ ఆధ్వర్యంలో పోతాన్కర్ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. 2006 – 07 లోని సభ్యత్వం తీసుకున్నప్పటికీ, సభ్యతని తొలగించారని  ఇలా ఇంకా ఎన్ని సభ్యత్వాలు తొలగింపు జరిగింది తెలియదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా ఓటు హక్కు తొలగించబడిన సభ్యులకు వారి పేర్లు ఎందుకు ఓటర్ల జాబితాలో లేదో తెలుసుకునే అవకాశం కల్పించాలని , ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల్లో ఓటర్ల జాబితా నుండి అత్యంత కీలకమైన అర్హత కలిగిన సభ్యుల పేర్లు అన్యాయంగా తొలగించబడింది అని, ఎన్నికల ప్రక్రియపై సభ్యుల విశ్వాసాన్ని కాపాడడానికి అవసరమని వివరించారు. ఈ అంశంపై తక్షణ విచారణ జరిపి వాస్తావలను నిర్ధారించి అర్హత కలిగిన సభ్యులను ఓటు హక్కు కల్పించే విధంగా చూడాలని కోరారు.

 అసోసియేషన్ ల పేరుతో ఓటు సభ్యత్వమా?

గతంలో జరిగిన సభ్యత్వం వ్యవహారం ఇప్పుడు తెరమీదకు వచ్చింది..మెంబర్షిప్ లు అసోసియేషన్ లు, పిఎసిఎస్ ల పేరుతో రసీదు చేయడం జరిగింది. సభ్యత్వ నమోదులో వ్యక్తులకు ఇవ్వకుండా వాటిని ఇప్పటివరకు గుర్తించి సరైన సభ్యత్వాన్ని సర్దుబాటు చేయలేదని  తెలిసింది. అదేవిధంగా కొందరు వ్యక్తులకు కాకుండా సంస్థ లకు సభ్యత్వం ఇవ్వడం జరిగిందని ఆరోపణ చేశారు. గతంలో రెడ్ క్రాస్ లో కీలక పధవిలో ఉన్న వ్యక్తి చెయించిన 100 సభ్యత్వాల వివరాలు ఓటర్ల జాబితాలో లేవని తెలిపారు. గతంలో డివిజన్ అధ్యక్షుడు గా పనిచేసిన వ్యక్తి ఓటును డివిజన్ మార్చారని పిర్యాదు చేసినట్లు తెలిసింది. అంతే కాకుండా రెడ్ క్రాస్ నిబంధనలకు విరుద్ధంగా మండల కమిటీ ఏర్పాటు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది..

Voter turnout in Indian Red Cross Society
Voter turnout in Indian Red Cross Society

 ఎన్నికల కోసమే సభ్యత్వాల పెంపునకు అడ్డుకట్టానా….

ప్రముఖ స్వచ్చంధ సంస్థ రెడ్ క్రాస్ లో సేవా కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ, సభ్యత్వాలను పెంచాల్సిన చోట తగ్గించడం వెనుక కొందరు పెద్దల హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. సంస్థలో పనిచేసే ఒకరిద్దరిని వాడుకుని తతంగం జరిగింది ఆరోపణలు ఉన్నాయి. స్వచ్చంధ సంస్థ సంబంధించిన అడిట్ ను చూపించకపోవడం, ఉద్దేశపూర్వకంగా సభ్యత్వ నమోదు చేయలేదని ప్రధాన విమర్శలు ఉన్నాయి. కేవలం సోసైటిలో పధవులను తమ అధినంలో ఉంచుకునేందుకు ఈ వ్యవహారం జరిగిందా అనే చర్చ జరుగుతుంది. సోసైటి ఉద్యోగులు కోందరికి వత్తాసు పలుకుతు ఎన్నికల ప్రక్రియలో పాల్గోంటున్న విషయం కుడా బహిర్గతమైంది.

 

More articles

Latest article