27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఎదురెదురుగా ఢీకొన్న బైకులు

Must read

 

. . . అక్కడికక్కడే మృతి చెందిన రికవరీ ఏజెంట్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించిన సంఘటన గురువారం మధ్యాహ్నం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన పుల్గం వెంకటస్వామి (39) తండ్రి: రాజయ్య, ఒక కంపెనీలో రికవరీ ఏజెంట్ గా పని చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన బైక్‌పై వెళ్తుండగా, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్చిపూర్ రోడ్‌లో ఉన్న చర్చి సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో వెంకటస్వామి తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article