27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ప్రహారీ గోడ నిర్మాణ పనులు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : పాల్వంచ మండలంలోని భవానిపేట్ గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ మాల సంఘ  భవన ప్రహారీ గోడ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభించినట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేశారని తెలిపారు. అడిగిన వెంటనే ప్రహారీ గోడ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి అధ్యక్షులు దోమకొండ స్వామి, బీజేవైఎం కార్యదర్శి  పోతరాజు రాజేష్,  మండల ఉపాధ్యక్షులు నాతి వెంకట్ గౌడ్,  భూత్ అధ్యక్షులు మెకానిక్ స్వామి, మంగలి వెంకట్,   మాల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article