29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసింది

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కొరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని నిలబెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీలు లోపాయకారి ఒప్పందం ద్వారా బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.  కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల హామీ ప్రకారం చిత్తశుద్ధితో పనిచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కులగణనను పూర్తి చేసి బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా,ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని తెలంగాణ అసెంబ్లీలో చట్ట ప్రకారం బిల్లుల రూపొందించి గవర్నర్ కు పంపితే గవర్నర్  రాష్ట్రపతి పరిశీలన కొరకు పంపి ఐదు నెలల దాటుతున్న పెండింగ్ బిల్లు పెండింగ్ లోనే ఉన్నాయని కావాలనే కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటున్నట్లు ఉందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానం మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని మొక్కవోని దీక్షతో పనిచేస్తున్నారని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకొని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణ బీసీ బిల్లును ప్రవేశపెట్టి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతొ కలిసి పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల,నాయకులు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

The Congress party worked with sincerity.

More articles

Latest article