29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అణచివేత ధోరణిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాహుల్ గాంధీ అరెస్ట్ అమానుషం

 

. . . కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ :

 

దేశానికి మూల స్థంబాలైన యువత గురించి వాస్తవాలను మాట్లాడితే వాటిని అణిచివేచివేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థుల విషయంలో వాస్తవం మాట్లాడిన దేశ ప్రతిపక్ష నేతను ఢిల్లీలో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండస్తూ బుధవారం మండలంలోని కోమన్ పల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  రోజు రోజుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక నియంతలాగా,ఒక శాడిస్టుల వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజల పైన ముఖ్యంగా ఈ దేశ యువత పైన వాస్తవాలను మాట్లాడుతుంటే వాటిని అణచివేసే ధోరణి ఏదైతే ఉందో దానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యువత గురించి వాస్తవాన్ని మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అమానుషంగా అరెస్టు చేస్తూ దాడులు చేయడాన్నిజిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ముఖ్యంగా ఈ దేశ ప్రధానమంత్రి ఒకసారి వెనక్కి వెళ్లి చూసుకోవాలని, సుమారు 80 సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్లు కూడా ఈ బీజేపీ వాళ్ళ లాగా అణచివేత ధోరణి పాటించలేదని విషయాన్ని గుర్తిస్తే బాగుంటదన్నారు. ఒకపక్క నీట్ ఎగ్జాం తో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు,మరొక పక్క నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక నిరుద్యోగంలో కూరుకుపోతున్నటువంటి సందర్భం వీటన్నింటిపై ఈ దేశ యువత ఉద్యమిస్తే తీవ్రవాదుల పైన రాక్షసి కార్యక్రమాలు చేసినటువంటి వారిపై ప్రయోగించాల్సినటువంటి బిఆర్ గ్యాస్,  వాటర్ క్యాన్లతో దాడులు చేయించిన విధానాన్ని  కాంగ్రెస్ పార్టీయే కాదు యావత్ భారత దేశమే తీవ్రంగా ఖండిస్తుందన్నారు.  ఇది తప్పు అని మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,కార్గే, ప్రియాంక గాంధీ, కేసు వేణుగోపాల్, అఖిలేష్ యాదవ్ లను అరెస్ట్ చేసి ఈ దేశానికి ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నావో చెప్పాల్సిన బాధ్యత బిజెపి ప్రభుత్వం పైన ఉందన్నారు. ఈ దేశ యువత ఏ లక్ష్యం కోసమైతే పోరాటం చేసిందో ఎ లక్ష్యం నెరవేరేవరకు ఉద్యమం ఆపరాన్ని చెబుతుందో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు ఈ ఉద్యమాలు ఈ విధంగానే కొనసాగుతాయన్నారు. కచ్చితంగా రాహుల్ గాంధీ  ఆలోచనలన్నింటిని, ఆయన చేస్తున్నటువంటి విధానాలు అన్ని కూడా  కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు తీసుకువెళతామన్నారు. మీ మెడలో నుంచి మిమ్మల్ని గద్దెదించే రోజు ఎంతో దూరం లేదన్నారు. నరేంద్ర మోడీ నియంతృత్వ పొగడలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి, వేల్పూర్ మండల సర్పంచులు రాజు, భూమ రెడ్డి, జనార్ధన్, నవీన్, శ్రీనివాస్, రాజేందర్,నరేందర్, లింబాద్రి, భీంగల్ కౌన్సిలర్ నాగేంద్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సురేష్ రమణ, నరేందర్, శ్యామ్, ఇంద్ర గౌడ్ ప్రవీణ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article