29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీ స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల పోస్టర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కోచింగ్ కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తుల ఆహ్వాన పోస్టర్‌ను శుక్రవారం నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వి. భుజంగరావు ఆవిష్కరించారు. బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ 9 నెలల ఉచిత శిక్షణ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 7 గా నిర్ణయించారు. అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో గ్రూప్స్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, పోలీస్ నియామక పరీక్షల కోసం నిర్వహించే ఐదు నెలల ఉచిత శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 14 గా పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీడబ్ల్యూబీసీడీవో రజిత, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ సి.హెచ్. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article