27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అమరవీరుల ఆశయాలు కొనసాగించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అమరవీరుల ఆశయాలు కొనసాగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ నిజామాబాదు జిల్లా కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి జెండా వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దినాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గౌరవ విషయమన్నారు. రాష్ట్ర ప్రజల ఆశయాలు నెరవేర్చే దిశగా బీజేపీ పార్టీ కృషి చేస్తోందన్నారు. తెలంగాణ కోసం బీజేపీ ముందుకు వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు బీజేపీ తరఫున ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగాలను బీజేపీ ఎప్పటికీ మర్చిపోదని, తెలంగాణ అభివృద్ధి పట్ల పార్టీ పూర్తిగా అంకితమై ఉన్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ఇచ్చిన భావోద్వేగ ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటే  నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయని అన్నారు. ఆమె నైతిక మద్దతుతోనే బీజేపీ తెలంగాణ ప్రజల పక్షాన నిలిచింది అని తెలిపారు. తెలంగాణ చిన్నమ్మగా పేరు పొందారు అని అన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం నూతన అభివృద్ధి దిశగా సాగిపోతోందని అన్నారు. “సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్” నినాదంతో మోదీ అందిస్తున్న కేంద్ర పథకాలను రాష్ట్రంలోని పల్లెల్లోకి, ప్రజలందరికీ చేరవేసేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మి నారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి ఉపాధ్యక్షలు నాగోల్ల లక్ష్మి నారాయణ,రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, కార్పొరేటర్లు పంచారెడ్డి ప్రవళిక, మాస్టర్ శంకర్,బట్టు రాఘవేందర్,రాంచందర్,మండల అధ్యక్షులు ఇప్పకాయల కిషోర్, కోడూరు నాగరాజు,ఆనంద్ రావు, తారక్ వేణు, బీజేపీ నాయకులు ఓం సింగ్, మల్లేష్ గుప్తా, యాదల నరేష్,అమందు విజయ్ కృష్ణ,చింతకాయల రాజేందర్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

The aspirations of the martyrs must continue.

More articles

Latest article