హైదరాబాద్, బతుకమ్మ : గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేస్తున్న నాయకులకు పీసీసీ కార్యవర్గంలో అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఐఎన్టీయూసీ నాయకులు కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్, ఐఎన్ టీ యూసీ నాయకులు హైదరాబాద్ గాంధీ భవన్ లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్, ఎడ్ల నాగరాజ్, రామకృష్ణ, హరి బాబు, రాంభూపాల్, ప్రమోద్, కృపాల్ సింగ్, బాబి తదితరులు పాల్గొన్నారు.