నిజామాబాద్ సిటి, బతుకమ్మ : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అనుమతులు లేకుండానే ఏడాది కాలంగా సీబీఎస్ఈ పేరిట తరగతులు నిర్వహిస్తున్న నిషిత ఇంటర్నేషనల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్ బిన్ అబూద్ కలెక్టరేట్ ఏవోకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లోని అమ్మ వెంచర్ లో ఏడాది కాలంగా నిషిత ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత స్కూల్ కు సీబీఎస్ ఈ బోర్డు అనుమతి లేకున్నా కేవలం దరఖాస్తు చేసిన పత్రంతోనే తమకు అనుమతి ఉందని, సెలబస్ అమలు చేస్తున్నామని, కర్క్యూలం ఫాలో అవుతున్నామని, ప్రజలను మోసం చేస్తున్నామన్నారు. ఏడాది కాలంగా సీబీఎస్ఈ పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల ఫీజులు వసూల్ చేశారని ఆరోపించారు. స్టేట్ బోర్డు అనుమతి ఉన్నప్పటికీ సీబీఎస్ఈ అనుమతి పేరిట విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసగిస్తున్న నిషిత ఇంటర్నేషనల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారు.

