అమరవీరుల ఆశయాలు కొనసాగించాలి
బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అమరవీరుల ఆశయాలు కొనసాగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ నిజామాబాదు జిల్లా కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి జెండా వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దినాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గౌరవ విషయమన్నారు. రాష్ట్ర...