. . . ధార్మిక మంచ్ జిల్లా కో కన్వీనర్ సోడి కృపాల్ సింగ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సమాజం లో సామరస్యం పెంపొందించడమే ఇఫ్తార్ విందు ముఖ్య లక్షణం అని ధార్మిక మంచ్ జిల్లా కో కన్వీనర్ సోడి కృపాల్ సింగ్ అన్నారు. ఆల్ ఇండియా సుఫి సజ్జద నా సీన్ కౌన్సిల్, నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో కంటేశ్వర్ లోని ఆస్థాన హాలియా హజరత్ సయ్యద్ షా కమల్ బియాభాని లో సుఫీ మొహమ్మద్ దావూద్ ఖాద్రి అధ్యక్షతన ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దైవారాధన, కృతజ్ఞత, సోదర భావం, మతసామరాస్యానికి ప్రతీక అని అన్నారు. ఇఫ్తార్ సమయంలో ప్రత్యేకించి దానధర్మాలు చేయడము, పేదలకు ఆహార అందించడం వల్ల అల్లాహ్ అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారన్నారు. అల్లాహ్ దయ రాష్ట్రంపై ఎప్పుడు ఉండాలని వేడుకున్నారు.
