- చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి
ఇందల్వాయి,బతుకమ్మ
ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం అభివృద్ధి బాటలో నడిపించడమే లక్ష్యమని పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి సహకారంతో వరి ధాన్యం కొనుగోలుగలో రైతులకు నష్టం చేకూరకుండా చూడడమే తమ ధ్యేయమని తెలిపారు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కానీ కానీ వారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పేర్లు నమోదు పంట రుణమాఫీ కాని వారికి న్యాయం జరిగేలా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
