. . . డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
నిజాంసాగర్, బతుకమ్మ :
ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన అమలు కోసం ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా గురువారం గోర్గల్ సొసైటీ ఫంక్షన్ హాల్‌లో నిజాంసాగర్ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల పరిధిలోని అంగన్ వాడీ టీచర్ల సమక్షంలో నిర్వహించిన పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

