. . . కమాలపూర్ లో రైతుల రాస్తారోకో
డిచ్ పల్లి, బతుకమ్మ:
చేతికి వచ్చిన వరిని కోసి ఎండబెట్టి పక్షం రోజులు గడుస్తున్న దాన్యం కోనుగోళ్లు జరుపకపోవడం పై కర్షకులు మండిపడుతున్నారు. తెలంగాణ కు రైస్ బౌల్ గా పేరు గాంచిన నిజామాబాద్ జిల్లాలో దాన్యం కోనుగోళ్లు ప్రారంభించకపోవడంపై నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రైతులు అధికార యంత్రాంగం తీరుపై మండిపడ్డారు. గురువారం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం కమలాపూర్ లో రైతుల ఆందోళన చేపట్టారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డుపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వరి ధాన్యాన్ని కోసి నెల రోజులవుతున్న కాంటాలు చేయడం లేదంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు ఎండలు దంచికోడుతుంటే, అకాల వర్షాల భయం వెంటాడుతుండగా ధాన్యం సేకరణ జరుపకపోవడంతో దళారులు తక్కువధరకు కోనుగోళ్లు చేస్తున్నారని దాని వలన రైతులు నష్టపోతున్నారని అన్నారు. అదే విధంగా కలెక్టర్ వచ్చి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళన కారులను సముదాయించి ఆందోళన విరమించారు.
