29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కాకతీయ ఒలంపియాడ్ లో టెట్రోనిక రోబోటిక్స్ ఎక్స్ పో

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : నగరంలోని కాకతీయ ఒలంపియాడ్ స్కూళ్లో మంగళవారం టెట్రోనిక రోబోటిక్స్ ఎక్స్ పో -2025 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యార్థులు అనేక రకాల ప్రాజెక్ట్ లు తయారు చేసి రోబోటిక్స్ ఎక్స్ పో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు వివరాలను వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ హాజరై విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్ వివరాలను వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ  మాట్లాడుతూ భవిష్యత్తులో ఎంతగానో

Tetronica Robotics Expo at Kakatiya Olympiad

ఉపయోగపడతాయని అన్నారు. ఇలాంటి విద్యను కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులకు విద్యను అందించడం గర్వకారణం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జిల్లా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్లు సీహెచ్.తేజస్విని, సీహెచ్.రాజ, సీహెచ్.రామోజీ రావు, ప్రిన్సిపాల్ పీవీ నటరాజ్, కో ఆర్డినేటర్ శ్రీలత, రోబోటిక్స్ హెచ్ఓడీ సదానంద్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల పాల్గొన్నారు.

Tetronica Robotics Expo at Kakatiya Olympiad

More articles

Latest article