నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని కాకతీయ ఒలంపియాడ్ స్కూళ్లో మంగళవారం టెట్రోనిక రోబోటిక్స్ ఎక్స్ పో -2025 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యార్థులు అనేక రకాల ప్రాజెక్ట్ లు తయారు చేసి రోబోటిక్స్ ఎక్స్ పో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు వివరాలను వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ హాజరై విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్ వివరాలను వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎంతగానో

ఉపయోగపడతాయని అన్నారు. ఇలాంటి విద్యను కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులకు విద్యను అందించడం గర్వకారణం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జిల్లా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్లు సీహెచ్.తేజస్విని, సీహెచ్.రాజ, సీహెచ్.రామోజీ రావు, ప్రిన్సిపాల్ పీవీ నటరాజ్, కో ఆర్డినేటర్ శ్రీలత, రోబోటిక్స్ హెచ్ఓడీ సదానంద్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల పాల్గొన్నారు.
